Type Here to Get Search Results !

Athisrestuda Na Yesayya Song Lyrics | అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా Song Lyrics

Athisrestuda Na Yesayya Song Lyrics | అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా Song Lyrics

Athisrestuda Na Yesayya Song Lyrics
అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా
మహాఘనుడా మహోన్నతుడా
నీ కార్యములు గంభీరముల్ -2
గళమెత్తి స్వరమెత్తి నే పాడెదన్ -2

1. స్తుతులు చెల్లించగానే యెరికో గోడలు కూలెనే
కీర్తనలు పాడగానే చెరసాల బ్రద్దలాయే -2
నీ జనుల ముందు శత్రువులే నిలుచునా
నీ బలము ముందు బందకాలుండునా -2
బందకాలుండునా
గళమెత్తి స్వరమెత్తి నే పాడెదన్ -2

2. నీ ముందు నిలిపిన దాగోను ముక్కలాయెనుగా
నిన్ను చూసిన సేనా దెయ్యాలు వణికి పోయెనుగా -2
నీ శక్తి ముందు ఏదైనా నిలుచునా
నీ అగ్ని అన్నిటిని దహించి వేయునుగా -2
దహించి వేయునుగా
గళమెత్తి స్వరమెత్తి నే పాడెదన్ -2

3. సియోనులోనుండి మమ్ము ఆశీర్వదించితివి
శిథిలమైన బ్రతుకులను శిఖరముపై నిలిపితివి -2
నీ మహిమముందు శాపమే నిలుచునా
కృపవెంబడి కృపతో నడుపుచున్నావయ్యా -2
నడుపుచున్నావయ్యా
గళమెత్తి స్వరమెత్తి నే పాడెదన్ -2

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area