-->
Type Here to Get Search Results !

Anandamega Anni Velala Song Lyrics | ఆనందమేగా అన్ని వేళలా Song Lyrics

Anandamega Anni Velala Song Lyrics | ఆనందమేగా అన్ని వేళలా Song Lyrics | Telugu Christian Songs Lyrics

 Anandamega Anni Velala
Details Name
Lyrics Writer Sayaram Gattu
Vocals/Singer Anu Roy Samuel

ఆనందమేగా అన్ని వేళలా,

నీ ప్రేమలో

సంతోషమేగా సదా కాలము,

నీ సన్నిధిలో || 2 ||

కష్టాల కడలిలో పయనమైనా

ఏ రీతి బాధలు నన్ను క్రుంగదీసినా || 2 || || ఆనందమే ||


కురిసే కన్నీటికే తెలుపనా

ఎగిసిపడే తుఫానునే అణిచావని

నా గుండెలో భారముకు చెప్పనా

ఈ లోక భారమునే మోసావని || 2 ||

ఏముంది నీ నామములో కానిది!

ఏదయినా, ఏమయినా నీవేగా నా పెన్నిధి || 2 || || ఆనందమే ||


అలముకున్న చీకటికి తెలియకున్నది

నీ వెలుగుగా నన్నే నువ్వు పిలిచావని

వేధించే శోధనలు ఎరుగకున్నవి

ఆ కొలిమిలో నా శుద్ధత పెంచుతావని || 2 ||

ప్రతి ఇరుకులో విశ్వాసము పెరుగుతుండగా

సాగెద నీ మార్గములో నిరతము నిన్ను చేరగా || ఆనందమే ||

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area