Naa Hrudayamaa Song Lyrics | నా హృదయమా Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Hosanna Ministries |
| Vocals/Singer | Pastor Ramesh |
ప్రేమ.... ప్రేమ... ప్రేమ...
ప్రేమ పవిత్రమైనది,
ప్రేమ గాఢమైనది ,
గాయాలపాలైనను గాయపరచదు ప్రేమ ,
కన్నీరు కారుస్తుందే కానీ కన్నీరు పెట్టించదు ప్రేమ ,
దెబ్బ తింటుందే కానీ దెబ్బ కొట్టదు ప్రేమ ,
ప్రాణం పెడుతుందే గాని ప్రాణం తీయదు ప్రేమ,
ఆ ప్రేమే నా యేసు ప్రేమ
పల్లవి:
నా హృదయమా - నా ప్రాణమా ..
నా శ్వాసతో - అనుబంధమా ..
నా కొరకే నరరూపివై - నా పాప భారము మోసి
నా కొరకు బలియైనది నీవే - నా యేసయ్యా….
చరణం 1:
చిందిన నీ రక్తం - పారెను సెలయేరై
చీల్చ బడిన దేహం - ఓర్చెను ఆ భారం
శిక్షకుపాత్రుడనైన - నను రక్షించుటకా
చిత్రవధ చేసిన - మౌనిగ నిలిచినది
ఎవరు - నాపై - చూపని ప్రేమే కదా
ప్రేమామయా - తేజోమయా…
నీ ప్రేమ ఎంతో బలము
నీ త్యాగమెంతో ఘనము
నీ ప్రేమకు నే రుణపడి ఉన్నాను - నా యేసయ్యా
చరణం 2:
చేదు చిరకనిచ్చి - నిను అవమానించిరిగా
స్వార్థ పరుల అహమే - గెలిచిన ఆవేళ
తులువలనే క్షమించెను - నీ దైవత్వము
తుదిశ్వాసవరకు ప్రేమించెను నీ దాతృత్వము
నీకే నీకే అది సాధ్యమైనది
ప్రేమామయా - తేజోమయా
నీ ప్రేమ ఎంతో బలము
నీ త్యాగమెంతో ఘనము
నే వివరించలేనయ్యా నా యేసయ్యా…
