ALALA KADALI Song Lyrics | అలల కడలి ఎగసిన Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Bro.P.James |
| Vocals/Singer | Bro.P.James |
అలల కడలి ఎగసిన
అలజడి సృష్టించిన
చీకటి కమ్మేసిన
హితము గతము మరచిన
నా మది క్షీణించిన
నీ చెయ్యి తోడయ్యనే
దేవా నా జీవం నా ప్రాణం నీవేలే
దేవా నా పయనం నా గమ్యం నీవేలే ||2||
Charanam 1 :
సొంతవారే సనిగిన జగమే దూషించిన
మోసే చూసింది నిన్నేగదా
వెకిలి మాట చేత విలపించిన
యిర్మియా ప్రార్ధించినది నీకేగదా ||2||
ఇకను ఏమి చెప్పేదన్ నీవు
తోడుంటే రాజ్యములను జయించిరే
నీతిని జరిగించి వాగ్దానములు
పొంది సింహపు నోళ్లు మూసిరే ||2|| దేవా...
Charanam 2:
శరీరదారియైన దినములలోన
క్రీస్తుకు మిగిలింది కన్నీళ్లేగా
మహా రోదనతో మరణములోనూ
క్రీస్తు పిలిచింది నిన్నేగా ||2||
అగాధ జలములలోన నీవు తోడుండి
నన్ను తిరిగి లేపితే ||2||
హృదయపూర్వకముగా నీవు
విచారము దుఃఖము నాకు కలుగజేయవు...||2|| దేవా...
