NAVVANI NAVVANI YESU UNNADU Song Lyrics | నవ్వని నవ్వని యేసు ఉన్నాడు Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Bro. Shalem Raj |
| Vocals/Singer | Bro. Shalem Raj |
పల్లవి
నవ్వనీ నవ్వనీ నవ్వే వారిని నవ్వనీ
చెయ్యనీ చెయ్యనీ హేళన వారిని
చెయ్యనీ. "2"
యేసు ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు
యేసు ఉన్నాడు లెక్కలు రాస్తున్నాడు "2"
చ.1
సంద్రాలకు సరిపోలిస్తే చినుకు చిన్నదైనా
పచ్చనైనపైరుకు జీవం చిన్ని చినుకులేగా "2"
ఎంత బ్రతుకు నీదని ఎంచుతున్నవారే
విలువ తెలియువేళ మించి పొగడుతారే "2"
వారి అంచనాలే అవును తారుమారే "2"
చ.2
జారిపడిన నిన్ను చూసి జాలి చూపవలసినవారే
గేళి చేసి నీ మనసు గాయపరచినారా "2"
కుంగుబాటులేల లొంగిపోదువేళ
ప్రజ్వలించె నీపై యేసు ప్రేమ జ్వాల "2"
వారి వెర్రి గోల లక్ష్యపెట్టనేల
దైవకార్యముంది చూడు కన్నులారా
