Naa Upiri Aagevaraku Aaradhinthunu Song Lyrics | నా ఊపిరి ఆగేవరకు Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Dr. N. Gideon |
| Vocals/Singer | Ps. Chinni Savarapu |
నా ఆరాధనకు యోగ్యుడా ఆత్మ స్వరూపుడా
నా ఆరాధనకు పూజ్యుడా స్తుతులకు పాత్రుడా " 2 "
అనుక్షణం నా మదిలో నిన్నారాధించెదను
అనుదినము నీసన్నిధిలో ఆనందించెదను
ఆరాధన నీకే ఆరాధన నీకే " 2 "
" నా ఆరాధనకు యోగ్యుడా "
1 ) మాటతో సృష్టిని చేసిన యేసుని ఆరాధించెదను
మట్టితో నన్ను చేసిన యేసుని ఆరాధించెదను "2"
మార్గము జీవమైన యేసుని ఆరాధించెదను "2'
మరణపు ముల్లును విరిచిన యేసుని ఆరాధించెదను "2"
ఆరాధన నీకే ఆరాధన నీకే " 2 "
అనుక్షణము నా మదిలో నిన్నారాధించేదను
అనుదినము నీ సన్నిధిలో ఆనందించెదను "2"
" నా ఆరాధనకు యోగ్యుడా "
2) అరణ్య యాత్రలో ఒంటరినైన ఆరాధించెదను
అవహేళనలు ఎదురైనా ఆరాధించెదను "2"
అలలన్ని ఎగసిపడినా ఆరాధించెదను "2"
నా ఆస్తులన్నీ కోల్పోయిన ఆరాధించెదను "2"
ఆరాధన నీకే ఆరాధన నీకే " 2 "
అనుక్షణము నా మదిలో నిన్నారాధించేదను
అనుదినము నీ సన్నిధిలో ఆనందించెదను "2"
" నా ఆరాధనకు యోగ్యుడా "
3) ఓటములెన్నో ఎదురైనా
ఆరాధించెదను
ఒంటరిగ కుమిలిపోయిన ఆరాధించెదను "2"
అనాధగా విడిచిపెట్టిన ఆరాధించెదను "2"
నా ఊపిరి ఆగేవరకు నిన్నే ఆరాధింతును "2"
ఆరాధన నీకే ఆరాధన నీకే " 2 "
అనుక్షణము నా మదిలో నిన్నారాధించేదను
అనుదినము నీ సన్నిధిలో ఆనందించెదను "2"
" నా ఆరాధనకు యోగ్యుడా "
