MAHA TEJUDA NAA YESAIAH Song Lyrics | మహా తేజుడా నా యేసయ్య Song Lyrics | Christian New Year Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Bro.Mathews |
| Vocals/Singer | Bro.Mathews |
జగతికి ఆధారమా - జనహిత సంక్షేమమ
నా జతగా నిలిచిన జీవన సాఫల్యమా చెరగని మమకారం నీది చెదరని అనుబంధం
ఆత్మీయ శిఖరముపై నను చేర్చే
యేసయ్యా మహా తేజుడా
నా యేసయ్య మనోహరుడా నీకే ఆరాధన
1)నను చేర్చినావు నీ సారెపైన
నా పరమ కుమ్మరి నా యేసయ్యా
నీ చేతిలోనుండి నను జారనియ్యక
నీ మహిమ పాత్రగ నను మలచితివి
2) ద్రాక్షవల్లివైన నా యేసురాజా
నీలోనే నన్ను అంటుకట్టినావు
నీ కృపా వనములో నే పరిమళ వృక్షమునై
నా జీవితాంతం ఫలియించెదను
3)సీయోనులో నుండి నను దీవించితివి పరవశించి
నా మది పులకించి పాడెను నా పూర్ణ హృదయముతో
నిన్నే సేవింతును నే బ్రతుకుచున్నది నీకోసమేనయ్యా
