Adhikamugaa Cheyagaladu Song Lyrics | అధికముగా చేయగలడు Song Lyrics | New Year Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Bro. Shalem Raj |
| Vocals/Singer | Bro. Shalem Raj |
అడిగే వాటికంటే ఊహించే వాటికంటే
అధికముగా చేయగలవు యేసయ్యా
నన్ను నడిపే సారధివి నీవేనయ్యా "2"
(నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా )
"అడిగే "
1.చేసి ఉన్న ప్రార్ధన నేను మరచిపోయినా
నువ్వు మరచిపోవుగా నా మంచి నాయనా "2"
అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన "2"
పట్టజాలపోతినిగా నీవిచ్చిన దీవెన "2"
"అధికముగా "
2.అల్పమైన వాటిని ఆశించును నా హృదయం
అధికమైన మేళ్ళనూ దాచును నీ మంచితనం "2"
ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం "2"
ఏది నాకు కావాలో ఎంచి యిచ్చు నీ జ్ఞానం "2"
"అధికముగా "
