Divya Karunya Deva Song Lyrics | దివ్య కారుణ్య దేవా Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Fr. Simon Kinthala |
| Vocals/Singer | Swetha Mohan |
దివ్య కారుణ్య దేవా నిత్య ప్రేమ ప్రవాహమా
నీదు దయలో నీదు కృపలో నన్ను దాయుమాll2ll
నమ్ముచున్నాను నమ్ముచున్నాను
యేసువా నిన్ను నమ్ముచున్నాను ll2ll
1. సమస్యలెన్ని ఉన్నను అవి మాయ మౌనుగా
నిన్ను నేను ఆశ్రయించగా -
నిరాశలెన్ని ఉన్నను అవి ఆవిరౌనుగా
నీదు సన్నిధి నేను చేరగా
అభయమిచ్చే వాడవు ఆదరించే వాడవు
నమ్మదగిన దైవము నీవేనని ll2ll llనమ్ముచున్నానుll
2. మనసులోని కలతలు నన్ను కృంగదీయునా
నీవు నాకు తోడు ఉండగా
ఈ లోక చీకటి శక్తులు నా దరికి చేరునా
నీవే అండగా నాకు ఉండగా
శక్తినిచ్చే వాడవు ధైర్యమిచ్చే వాడవు
నమ్మదగిన దైవము నీవేనని ll2ll llనమ్ముచున్నానుll
