NAA VIJAYA SAARADHI NEEVE Song Lyrics | నా విజయసారథి నీవే Song Lyrics | New Year Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | EMMANUEL MINISTRIES |
| Vocals/Singer | Bro. Jermiah |
పల్లవి:
నా విజయసారథి నీవేగా
నడిపించుము నను అనునిత్యము ॥2॥
ఎడారులన్నీ ఏదేనులాయెనే ॥2॥
నాతో నీవుండగా
నీతో నేనుండగా ॥2॥
జయశీలుడా జయభేరి మ్రోగించితివి
ప్రతివత్సరం కనువిందుచేసితివి ॥2॥
॥ నా విజయసారథి ॥
చరణం 1:
వణుకుచుండగా నా పాదముల్
ఎదుటనున్న విపత్తు చూసి ॥2॥
శరణువేడగ విధాత నిన్నే
నీ శౌర్యమునకు సాక్షిగా చేసి (నిలిపి)
విజయ దుందుభి వినిపించావు ॥ జయశీలుడా ॥
చరణం 2:
ప్రతికూల స్థితులందు
మము ధైర్యపరచి ॥2॥
నా కుడి ప్రక్కన నీడవై నిలిచి
బాధనొందిన దేశమందు
వేదనలన్నీ వేడుకగా చేసి
విజయ ధ్వజముగ స్థాపించావు ॥ జయశీలుడా ॥
చరణం 3:
నివురు గప్పిన నా దోషముల్
నిలువరించిన నీ కృప చూసి ॥2॥
నివ్వెర పోయిన ప్రతివాది ఎదుట
నీ పవిత్రతకు ప్రతీకగా చేసి (నిలిపి)
విజయ మకుటం నాకిచ్చావు ॥ జయశీలుడా ॥
