Nee Chethi Kaaryamu Song Lyrics | నీ చేతి కార్యము Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Joshua Shaik |
| Vocals/Singer | Akshaya Praveen |
నీ చేతి కార్యము - నాలోన జరిగించు
నీ దివ్య చిత్తము - నాలోన నెరవేర్చు — (2)
నీ సన్నిధానము - నిత్యము కనపరచు
నీ వాగ్దానము - నాలోన స్థిరపరచు
యేసయ్య యేసయ్య - నా బలం నీవయా
ఏ భయం లేదయా - నీ కృప చాలయా
1. నీ దుడ్డు కర్రయు - నీ దివ్య హస్తము
నన్నాదరించును - నన్ను నడిపించును - (2)
నా మంచి కాపరీ - నీ కరుణ కాంతితో
నా దినములన్నియు - వెలిగించుము
యేసయ్య యేసయ్య - నా బలం నీవయా
ఏ భయం లేదయా - నీ కృప చాలయా
2. నా శత్రు సైన్యమే - నను చుట్టుముట్టినా
నీ జాలి హృదయమే - నన్ను విడిపించును
కన్నీటి ప్రార్ధనే - నాకున్న ఆయుధం
నా జయము నీవనీ - స్తుతియింతును
యేసయ్య యేసయ్య - నా బలం నీవయా
ఏ భయం లేదయా - నీ కృప చాలయా
3. ఉన్నత శిఖరముకు - నన్ను నడిపించును
ఎత్తైన స్థలములపై - నన్ను నిలబెట్టును
నా తోడు నీడగా - నీ వాక్య ధ్యానమే
నా బ్రతుకు బాటను - సరిచేయును
యేసయ్య యేసయ్య - నా బలం నీవయా
ఏ భయం లేదయా - నీ కృప చాలయా
