Keerthi Kireetama Song Lyrics | కీర్తి కిరీటమా Song Lyrics | Telugu Christian Worship Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Pas.V.Ramesh babu |
| Vocals/Singer | Pas.V.Ramesh babu |
అక్షయ పురమా - ఆనంద పరవశమా
క్షేమా నిలయమా - నా కీర్తి కిరీటమా ||2||
నీ అడుగుజాడలలో - స్థిరపరచు యేసయ్యా
నీ ఆలోచనతో - నడిపించు నాయకుడా ||2||
నీ చేతి క్రియలన్నీ - ఆశ్చర్య కార్యములే
నీ చిత్తము లేకుండా - ఏదియు జరుగదు | 2 || || అక్షయ పురమా ||
1. సొమ్మసిల్లి బహుగా - నే నలిగియుండగా
నా వేదనంతయు చూచిన దేవా ||2||
ఆకాశ విశాలమంత అనంత ప్రేమతో ||2||
నా హృదయవాంఛలను - తీర్చిన ప్రియుడా||2|| ||నీ చేతి||
2. నా ఎదలోతు వ్యధలన్నీ- ఎరిగిన నాధుడా
నా రోధన విని - దాహార్తి తీర్చితివి ||2||
నీ కృపా కనికరము - కొనియాడెదను ||2||
నీ గుణశీలతను - నిరతము చాటెదను ||2|| ||నీ చేతి||
3. నీ నీతి కార్యములు - నాలో నింపుటకు
నవ నూతనముగ - నను మార్చితివి ||2||
నీ స్వరూప దర్శనమే నా సౌభాగ్యము ||2|
నీ నిత్య నివాసమే - నా గమ్యస్థానము ||2|| ||నీ చేతి||
