Naa Sthiti Gathulanni Song Lyrics | నా స్దితిగతులన్నీ Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Vijaya Prasad Reddy |
| Vocals/Singer | Vijaya Prasad Reddy |
పల్లవి :
నా స్దితిగతులన్నీ మార్చేవాడవు నువ్వుంటే చాలు..
నా హృదయపువేదన తొలగించేందుకు నువ్వుంటే చాలు..
నా మానని గాయము మాన్పేవాడవు నువ్వుంటే చాలు..
నా కలతలు అన్నీ బాపేవాడవు నువ్వుంటే చాలు..
నువ్వుంటే చాలు నీ మాటముత్యాలు నువ్వుంటే నాకు మేలు నా దేవా..
నువ్వుంటే చాలు చిరు కాంతి పుంజాలు
నువ్వుంటే వేల వెలుగులు నా ప్రభువా..(2)
ఆరాధన నా జీవితాంతము నీ పాదక్రాంతము ఆరాధన
ఆరాధన నా ఆత్మదీపము నీదేగా సాంతము ఆరాధన (2)
చరణం : 1
నా కాలగతులు నీ వశములో ఉన్నవి
నీ చేతిక్రియలు నను ఆదరిస్తున్నవి (2)
నా గమనములో నా గమ్యములో నువ్వుంటే చాలు
నా ప్రతిపనిలో ప్రయాణములో నీ తోడుంటే చాలు (2)
నువ్వుంటే చాలు నీ తోటి పయనాలు
నీ కృపయే నాకు వేల వరహాలు
నువ్వు ఉంటే చాలు నీ జాలి రతనాలు
నీ ప్రేమకు సాటికావు ఏ సిరులు (2)
ఆరాధన నా ప్రేమకీర్తన కృతజ్ఞతార్పణ ఆరాధన
ఆరాధన ఈ స్తోత్రఅర్పణ నా హృదయస్పందన ఆరాధన (2)
చరణం 2
సంవత్సరములు ఎన్నో గడచిపోతున్నవి
నీ వాత్సల్యదయలు నన్ను ఆవరిస్తున్నవి(2)
నా అడుగులలో ప్రతీ అలజడిలో నువ్వుంటే చాలు
నా శోధనలో ప్రతి వేదనలో నీ తోడుంటే చాలు (2)
నువ్వుంటే చాలు నీ ప్రేమ వర్షాలు నా ఆత్మపొలమున అద్బుత ధాన్యాలు
నువ్వుంటే చాలు ఆనందభాష్పాలు
నీ పాదము కడిగేందుకు నా కన్నీళ్లు(2)
ఆరాధన రక్షణ వస్త్రము కప్పిన ప్రభువుకు ఆరాధన
ఆరాధన జీవము బహుమతి ఇచ్చిన తండ్రికి ఆరాధన (2)
