Dikkulanni Nanu Vekkirinchina Song Lyrics | దిక్కులన్ని నను వెక్కిరించిన Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Pauljaciob |
| Vocals/Singer | D.Jessy |
దిక్కులన్ని నను వెక్కిరించిన
నా దిక్కె నీవై ఉంటివే
బంధాలన్నీ బహు దూరమైనా
నా బంధం నీవై ఉంటివే ..
నా సొంతమా.. నా బంధమా ఆరాధన నీకే
అనురాగమా నా ఏసయ్యా ఆరాధనా నీకే
తెలియని కలతలే నన్ను తరుముచుండగా
ఎరుగని పోరాటమే- నను వెంటాడగా
నీ రెక్కల నీడలో నను దాచినావయా
ఏ కీడు రాకుండా నను కాచినవయ్య
ఊగిసలాడే ఊపిరికి ఊరటనిచ్చితివే
సాహసమైన కార్యాలెన్నో నాకై చేసితివే
ఆరడి మాటలే నను దోషిగా చేయగా
ఆగని నిందలే నను క్రుంగజేయగా
హేతువే లేని గాయాలే నను హేళన చేయగా
ఎదుటే నిలిచినా నీవే నా దరికే చేరగ
గడిచిన కాలము - నడచిన మార్గము నీవే చూచినది
తగిలిన గాయము -పగిలిన హృదయం నీవే మార్చినది
ఎడబాటులే అలవాటుగా మారిపోయెనే
తడబాటులే నను విడువక తల్లడిల్ల చేయగా
నున్న నీతో నంటూ - నా వెంటే నడిచిటివి
నా రక్షణ శృంగం నీవే -నీ రక్త కోటలో దాచావు
అర్హతలేని అల్పునికి అధికారం మిచితివే
అంతము వరకు ఆరాధించే భాగ్యము నిచితివే
