Neeve Naa Manchi Yesayya Song Lyrics | నీవే నా మంచి యేసయ్యా Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | B.John Wesley |
| Vocals/Singer | Sis.Jessi D |
||పల్లవి|| నీవేన నీవేన మంచి యేసయ్య
నీలోన మాధుర్యం ఉంది యేసయ్య
నా మంచి యేసయ్య
నా గొప్ప యేసయ్య
నా కోసం ప్రాణమిచ్చిన పరిశుద్దుడ
||నీవేన నీవేన||
1. కష్టాలు నష్టాలు నన్నావరించగ
కన్నీటి దుఃఖంలో నేను కృంగియుండగ
నా తండ్రివైనావు నన్నాదుకున్నావు
నా కష్టాలు కన్నీటిని తుడిచివేశావు
||నీవేన నీవేన||
2. వ్యాధి బాధ శ్రమల చేత నేను కృంగియుండగ
మరణ బంధకాలలో నేను పడియుండగా
నా వైదుడవైనావు నాకు స్వస్థనిచ్చావు
నన్ను వ్యాధి బాధ శ్రమల నుండి విడిపింపించావు
||నీవేన నీవేన||
