Paravashinchi Padana Song Lyrics | పరవశించి పాడనా Song Lyrics | Telugu Christmas Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | B. John Kennedy |
| Vocals/Singer | Lillian Christopher |
పరవశించి పాడనా
ప్రభు యేసుకు గీతము
పరమ పావనుడైన
బాల యేసుకు స్తోత్రము
పాడేద క్రిస్టమస్ గీతము
చాటేద ప్రభుని వార్తను(2)
(పరవశించి)
రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు
దీనుడై పశుశాలలో పవలించెను (2)
పాపులను రక్షింప ఏతెంచును(2)
మానవులకు శాంతిని దయచేసేను(2). (పాడేద)
(పరవశించి)
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడాయినే(2)
నిత్యుడాగు తండ్రి సమాధానకర్త(2)
అద్భుతములు చేయు దేవుడైనే(2)
(పాడేదా)
(పరవశించి)
ఈ దినమందినను ప్రభు యేసుని
రక్షకునిగా అంగీకరించూ సోదర(2)
పరలోక మార్గము యేసు దేవుడు(2)
నిత్యజీవము నిరతము అనుగ్రహించెను (2). (పాడేద)
(పరవశించి)
