Daivakumarudu Lokaniki Vachadu Song Lyrics | దైవకుమారుడు లోకానికి Song Lyrics | Telugu Christmas Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | JamesNarukurthi |
| Vocals/Singer | Joshua Gariki |
దైవకుమారుడు లోకానికి వచ్చాడు
అతిసుందరుడు మనకొరకె పుట్టాడు ||2||
నీకోసం నాకోసమే పరమును విడిచి భువికొచ్చినాడు ||2||
పరమును విడిచి భువికొచ్చినాడు
ఆనందమే ఆనందమే ఆ నింగిలోన
సంతోషమే సంతోషమే ఈ భువిలోన ||2||
1.పాపాత్ములమైన మన అందరి కొరకె
పరలోక రక్షణను తీసుకొచ్చినాడు
అంధకారం తొలగించుతాడు
భయమే లేదు మనకెన్నటికి ||2||
||నీకోసం నాకోసమే||
2.నశించిపోతున్న ఆత్మాలన్నిటిని
వెదకి వచ్చి రక్షించుతాడు ||2||
నిన్ను నన్ను క్షమియించువాడు
హృదయ వాంఛలను తీర్చే మహనీయుడు ||2||
||నీకోసం నాకోసమే||
3.అనుదినము మాట్లాడుతాడు
నిరంతరం తోడై ఉంటాడు ||2||
పరమునకు వారధిగా మారి
తండ్రి చెంతకు నడిపించుతాడు ||2||
||నీకోసం నాకోసమే||
