Gathinchina Kaalamantha Song Lyrics | గతించిన కాలమంతా Song Lyrics | Telugu New Year Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | BRO.CH.SIVA |
| Vocals/Singer | Vagdevi |
పల్లవి -:
గతించిన కాలమంతా
నన్ను కాపాడితివి
నూతన సంవత్సరం
నాకు నీవు ఇచ్చితివి "2"
దేవా నీకే స్తోత్రము
తండ్రి నీకే స్తోత్రము "4"
చరణం -: 1
నూతన హృదయాన్ని నాకు
దయచేయుము తండ్రి
నూతన స్వభావం దయచేయుము తండ్రి
నీ కీర్తిని చాటుటకే
నా ప్రాణం నిలిపితివి
నేను బ్రతికి ఉన్నానంటే
నీ కృపయే "2"
కాలములు సమయములు
నీ వశమే తండ్రి
నీ సెలవు లేక నేను భోజనం చేయగలనా"2" (దేవా నీకే)
(గతించిన)
చరణం -: 2
గడిచిన దినములలో
కష్టాలెన్ని ఎదురైనా
నీ వాక్యమే నన్ను ధైర్యపరచెను
నా బ్రతుకు పయనంలో
నీవు చేసిన మేలులు
నేను లెక్కింప లేనన్ని
ఉన్నవి తండ్రి "2"
నా జీవిత కాలమంతా
నీ సేవ చేసిన గాని
నీ ఋణము ఎప్పటికీ నేను తీర్చగలనా "2" ( దేవా నీకే)
(గతించిన)
