Nenante Entha Premo Song Lyrics | నేనంటే ఎంత ప్రేమో Song Lyrics | Telugu Good Friday Songs Lyrics

నేనంటే ఎంత ప్రేమో ఆ ప్రేమ మూర్తికి
నా కొరకే సిలువనెక్కే నా కలువరి నాధునికి (2)
యేసు రక్తమే జయం సిలువ రక్తమే జయం (4)
కలువరి రుధిరములో కడుగబడిన శిలను
నీ రక్త ప్రవహములో సిలువ చెంత చేరాను (2)
నీ ప్రేమే మార్చిందయా నన్నిలా
ఆ ప్రేమకు బానిసగా మారానయా (2)"నేనంటే"
నను రక్షించుటను నీ ప్రాణమర్పింప
వెనుకాడలేదుగా నా యేసయ్య
నా శిక్ష భరియించి శాపము తొలగించి
నా స్థానములో నీవు బలియైతివా
ప్రియమని ఎంచలేదుగా నీ ప్రాణమును
నా ఆత్మ విలువ నీవు యోచించితివా (2)"నేనంటే"