Neela Nesthamevvaru Song Lyrics | నీలా నేస్తమెవ్వరు Song Lyrics | Telugu Christian Songs Lyrics

నీలా నేస్తమెవ్వరు లేనే లేరుగా
నీలా సాయమెవ్వరు రానే రారుగా
గతమెంతైన పతనమైనా
సతమతమైన స్థితిగతులైనా
యేసయ్యా.. నీవేగా..2
విసిగి వేసారి కేక వేయగా
కరుణించమని నిన్ను వేడగా
దాటిపోక నన్ను నీవు ఆగి తేరి చూసావు
జాలి చూపి చేరదీసి
మనసు తెలుసుకున్నావు
ఆశ తీర్చి బ్రతుకు మార్చి దీవించావు
యేసయ్యా.. నీవేగా..2
మలిన బ్రతుకు భారమవ్వగా
కఠినుల కోపం నన్ను తరుమగా
ప్రేమ మూర్తివై నీవు నన్ను నీలో దాచావు
చేయి చాపి ఆదరించి శాప కట్లు తెంచావు
దారి చూపి సేద తీర్చి క్షమియించావు
యేసయ్యా.. నీవేగా..2
***********************************************
Vocals: Sharon Philip
Tune & Lyrics: Prabhod Kumar Adusumilli