-->
Type Here to Get Search Results !

Pavitramaina Prema Song Lyrics | పవిత్రమైన ప్రేమ Song Lyrics

Pavitramaina Prema Song Lyrics | పవిత్రమైన ప్రేమ Song Lyrics | Telugu Christian Songs Lyrics

Pavitramaina Prema

పల్లవి:

పవిత్రమైన ప్రేమ మరణంతో ముగిసిపోదు

ఆటంకాలెదురైనా వెనుతిరిగి చూసుకోదు

నువ్వు ఎంతగా నిందిస్తున్నా నిన్నే వీడిపోదు

నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నా నిన్నే ఎడబాయదు


"పవిత్రమైన ప్రేమ "


అ.ప:

నీకోసం బ్రతికేసింది, నీకోసం మరణించింది.

సరిహద్దులే చెరిపేసింది, పరముకు నిన్ను చేరుస్తూ ఉన్నది..

ఆ ప్రేమే నిన్ను కన్నది, ఆ ప్రేమే రక్తమిచ్చి నిన్ను కొన్నది 2

ఆ ప్రేమే నిన్ను కన్నది, అనునిత్యం నిన్ను కాస్తూ ఉన్నది



చరణం: 1

ప్రేమ పిచ్చిదేమో పిచ్చిదేమో యేసుప్రేమ

ఇల్లును వదిలి, పల్లెనా తిరిగింది ఆ ప్రేమ.

తల్లిని విడిచి, పగవారి ప్రేమకై ఎదురుచూసింది ఆ ప్రేమ

ఆకలి మరచి ఆ భాగ్యలకై అలమటించిందా ప్రేమ

ఉమ్మి వేసినా ఈడ్చివేసినా విడిచి పెట్టలేదు ప్రేమ

ఊరి చివరనే చేతులు చాచి నీకై నిలిచిందా ప్రేమ


"ఆ ప్రేమే నిను"


చరణం: 2

ప్రేమ గుడ్డిదేమో గుడ్డిదేమో యేసు ప్రేమ

పాపులతోనే పాపుల మధ్యలో తిరిగింది ఆ ప్రేమ

వ్యభిచారిని సహితం చంపొద్దు అంటూ క్షమించిందా ప్రేమ

వెన్నుపోటులే ఎన్ని పొడిచిన మిన్నకుండింది ప్రేమ

ప్రాణ ఆత్మలే ధారపోసింది రిక్తునిగా మారింది ప్రేమ

సిలువ వేసినా చీల్చివేసినా మౌనం దాల్చింది ప్రేమ


"ఆప్రేమే నిను"


"పవిత్రమైన ప్రేమ "

***********************************************

Vocals: Krishna Kumar

Tune & Lyrics: Krishna Kumar

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area