Nee Rekkala Needalo Song Lyrics | నీ రెక్కల నీడలో Song Lyrics | 2025 Telugu Christian Songs Lyrics
ప॥ నీ రెక్కల నీడలో కాచితివి ఇంతకాలము
విలువైన నీ ప్రేమలో దాచితివి గతకాలము
అ.ప. ఉప్పొంగే నా హృదయం నూతన గీతముతో
నే పాడి పొగడెదను స్తోత్రగీతముల్ (2) ॥నీ రెక్కల॥
1. గతమంత గాఢాంధకారమైన చేజారిన
జీవితాన ఆవరించే మరణవేదన
కలిగించితివి నిత్య నిరీక్షణ (2)
విలువైన ప్రేమతో నడిపించినావు (2)
దినములు జరుగుచుండగా ॥ఉప్పొంగే॥
2. ఆశలన్ని ఆవిరవుతున్న - చేరలేని
గమ్యములోన చీకట్లు కమ్ముకుంటున్నా
నడిపితివి నీ వెలుగులోన (2)
విలువైన ప్రేమతో నడిపించినావు (2)
సంవత్సరములు జరుగుచుండగా ॥ఉప్పొంగే॥
3. అంధకార తుఫానులు ఉన్న అత్యున్నత
నీ కృపలతోన మితిలేని నీ దయచేత
నిలిపితివి సంపూర్ణతలోన (2)
విలువైన ప్రేమతో నడిపించెదవు (2)
శాశ్వత కాలమువరకు ॥ఉప్పొంగే॥॥
***********************************************
LYRICS:
REV SANAM ANIL KUMAR
VOCAL:
SISTER SHARON PHILIP