Enduke Manasa Song Lyrics | ఎందుకే మనసా Song Lyrics | Telugu Christian Songs Lyrics
ఎందుకే మనసా నీకు తొందర
దైవ చిత్తం చేసి చూడు ముందర
అందుకే బ్రతుకుచున్నామిందున
అది మరచిపోకే బ్రతుకు గురిని ఎందున
1. దావీదును చూడగా స్థితిని మరచిపోయెగా
సంసోనును చూడగా గురిని మరచిపోయెగా
పాపమే దానికి బలమని తెలుసునా
పాపమెనుకే పరుగులెట్టుట క్షేమమా
2. బోయజును చూడగా తొందరపాటే లేదుగా
యోసేపును చూడగా పాపమునకే భయమురా
దైవచిత్తము నెరవేర్చెను చూడవా
ప్రభువు చూసి దీవించెను ఎరుగవా
3. మార్పు చెందిన పౌలుకు లోకమే ఒక పెంటరా
మార్పు లేని దేమా లోకాశలో మునిగెరా
లోకస్నేహం మరణమే అని తెలియదా
క్రీస్తు స్నేహం నిత్యజీవం ఎరుగవా
***********************************************
Lyrics, Tune, : B Charles
Music & Voice : Dr. A.R.Stevenson