Vekuva Tara Ilapai Song Lyrics | వేకువ తార ఇలపై Song Lyrics | Telugu Christmas Songs Lyrics
పల్లవి :
వేకువ తార ఇలపై వెలసే శిశువును పోలి మనకై చేరే...
అంతులేని అద్భుతం కన్యకే మరి కనెనుగా...
లోక రక్షణ కోసమే క్రీస్తు యేసు వచ్చెగా...
అ.ప. ఆనందం సంతోషం దివిలో భువిలో...
గొల్లలు జ్ఞానులు చేసిరిగా స్తోత్రం అదిగో...
చ.1.
మరియ మురిసె ఆనాడు ఆ యేసునే ఒడిలో...
నీవు నేను పొందాలి క్రీస్తేసునే మదిలో...
స్థలమే లేదే ఆ రోజున - చోటివ్వవా నేడు హృదయానా...
మార్పు నొంది స్వీకరించు క్రీస్తు నీలో జన్మిస్తే...
చ.2.
నింగిలోని ఓ తార ఆ యేసుకై వెలిగే...
జ్ఞానులకే దారి చూపగా ఆ క్రీస్తునే చేరే...
పాపమనే చీకటిని పారద్రోలగా...
ప్రాణమిచ్చి ఆ క్రీస్తు భాసిల్లెనుగా...
లోకమందు జ్యోతివై క్రీస్తునొద్దకే దారి చూపవా...
**********************************************
Lyrics : Bro. G.Nuthan Babu
Music : Bro. Prashanth Kumar Penumaka
Tune & Vocals : Singer Shylaja Nuthan