Puttinadamma Yesayya Song Lyrics | పుట్టినాడమ్మా యేసయ్య Song Lyrics | Telugu Christmas Songs Lyrics
పుట్టినాడమ్మా యేసయ్య పుట్టినాడమ్మా
పుట్టినాడయ్యో ఓరయ్యో పుట్టినాడయ్యో
పశులతొట్టెలో దీనుడై పుట్టి
పరమును వీడి మనకై వచ్చె
వింతైన ప్రేమను మనపై చూప
ఆశ్చర్యకరుడు దేవదేవుడే
పుట్టినాడమ్మా...ఆఆ...ఆఆ...
"(పుట్టినాడమ్మా)"
పాడు బతుకులను బాగు చేయంగా
పాషాణ హృదయాన్ని మెత్తంగా చేయంగా "(2)"
పుట్టినాడమ్మా యేసయ్య పుట్టినాడమ్మా
పుట్టినాడయ్యో ఓరయ్యో పుట్టినాడయ్యో
ఆపదలోనే కాపాడువాడు
ఆత్మ బంధువు తానై నిలచి
మంచు లాంటి మనసు నివ్వ
మదిలోనిండా మమత నింప
పుట్టినాడమ్మా...ఆఆ...ఆఆ...
"(పుట్టినాడమ్మా)"
గుండెల్లో బాధంతా దూరం చేయంగ
సాగని పయనాన్ని ముందుకు కదిలింప "(2)"
పుట్టినాడమ్మా యేసయ్యా పుట్టినాడమ్మా
పుట్టినాడయ్యో ఓరయ్యో పుట్టినాడయ్యో
వింతైన తార నింగిలో వెలసె
నిక్కంగ చూడ పుడమి పైన
జీవపు మార్గం జాడను చూప
నిత్యజీవం మనిషికివ్వగా
పుట్టినాడమ్మా...ఆఆ...ఆఆ...
"(పుట్టినాడమ్మా)"
***********************************************
Lyric & Tune: Dr John Wesly
Voice: Dr John Wesly & Mrs Blessie Wesly
Music: Sam K Kiran