-->
Type Here to Get Search Results !

Parama Daivame Song Lyrics | పరమ దైవమే Song Lyrics

Parama Daivame Song Lyrics | పరమ దైవమే Song Lyrics | Telugu Christmas Songs Lyrics

Parama Daivame

పరమ దైవమే మనుష్య రూపమై

ఉదయించెను నాకోసమే

అమరజీవమే నరుల కోసమే

దిగివచ్చెను ఈ లోకమే

క్రీస్తు పుట్టెను హల్లెలూయా (3)||పరమ||


అకార రహితుడు ఆత్మ స్వరూపుడు

శరీరము ధరియించెను

సర్వాధికారుడు బలాడ్యధీరుడు

దీనత్వమును వరించెను

వైభవమును విడిచెను

దాసునిగా మారెను (2)

దీవెన భువికి తెచ్చెను – ముక్తి బాటగా||పరమ||


అనాదివాక్యమే కృపాసమేతమై

ధరపై కాలుమోపెను

ఆ నీతితేజమే నరావతారమై

శిశువై జననమాయెను

పాపి జతను కోరెను

రిక్తుడు తానాయెను (2)

భూలోకమును చేరెను యేసురాజుగ||పరమ||


నిత్యుడు తండ్రియై విమోచనార్ధమై

కుమారుడై జనించెను

సత్య స్వరూపియై రక్షణ ధ్యేయమై

రాజ్యమునే భరించెను

మధ్య గోడ కూల్చను

సంధిని సమకూర్చను(2)

సఖ్యత నిలుప వచ్చెను శాంతి దూతగా||పరమ||


***********************************************

Lyrics & Tune: A R Stevenson

Vocals: Malavika

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area