Naa Mano Netramu Terachi Song Lyrics | నా మనోనేత్రము తెరచి Song Lyrics | Telugu Zion Songs Lyrics
పల్లవి: నా మనోనేత్రము తెరచి - నా కఠిన హృదయమును మార్చి (2)
అనుపల్లవి: అంధకారములో నేనుండ (2) - వెదకి నన్ రక్షించితివి (1)
1. నే పాప భారము తోడ - చింతించి వగయుచు నుంటి (2)
కల్వరి సిలువలో నా శ్రమలన్ (2) - పొందినన్ విడిపించితివి (1)
2. వేరైతి లోకము నుండి - నీ స్వరమును విని నినుచేర
సర్వము నే కోల్పోయినను - నీ స్వరమే నా స్వాస్థ్యమయా
3. ఎన్నాళ్ళు బ్రతికిన నేమి? - నీకై జీవించెద ప్రభువా!
బాధలు శోధనలు శ్రమలలో - ఓదార్చి ఆదుకొంటివయా
4. ఏమి నీ కర్పించగలను - ఏమీ లేని వాడనయ్యా
విరిగి నలిగిన హృదయముతో - అర్పింతు ఆత్మార్పణను
5. నీ సన్నిధిని నే కోరి - నీ సన్నిధిలో నేమారి
స్తుతి పాత్రగ ఆరాధింతున్ - యుగ యుగములు సర్వయుగములు
*******************************************
Zion Song No.196
Hebron Songs