Unnatha Durgamu Na Devude Song Lyrics | ఉన్నత దుర్గము Song Lyrics | Telugu Christian Songs Lyrics
పల్లవి:
ఉన్నత దుర్గము - నా దేవుడే
నా రక్షకుడే - నాకాశ్రయుడు
1. యెహోవా మహాత్మ్యము - ఎంతో గొప్పది
అధిక స్తోత్రములకు - పాత్రుండాయనే
ఆ ప్రభు ఐశ్వర్యము - గ్రహింపశక్యము కానిది
2. నా కోటయు నా శైలము ఆయనే
నాకేడెము రక్షణ శృంగమును
ఉన్నతమగు దేవుడే - నాకా శ్రయ దుర్గము
3. నా ప్రియ ప్రభువు - దవళవర్ణుడు
రత్నవర్ణుడు - నాకతి ప్రియుడు
పదివేల మందిలో - అతని గుర్తించెదను
4. నిత్యజీవము - మెండుగ నొసగి
పరమాహారము - తృప్తిగ నిచ్చె
నిరతము తన కృపతో - నిలుపుకొనెను స్తోత్రము
5. విజయ గీతము - పాడెద ప్రభుకే
విజయము నిచ్చెను - శత్రువుపైన
ఉన్నత దుర్గముపై నెక్కించెను స్తోత్రము