O Pavura Rupama Parishudhhathma Song Lyrics | ఓ పావుర రూపమా Song Lyrics | Telugu Christian Songs Lyrics
ఓ పావుర రూపమా
పరిశుద్ధాత్మ
మాపై దిగి రావా 2
ఆ ఆ ఆ ఆ
1. ఆదిలో జలములపైన తారాడినాత్మ దిగిరావ
(ఓ పావుర రూపమా)
2. ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావ
(ఓ పావుర)
3. దీర్ఘదర్శుల ప్రేరేపించిన ప్రేషిత ఆత్మ దిగిరావా
(ఓ పావుర)
4. రాజులను అభిషేకించిన పావన ఆత్మ దిగిరావా
(ఓ పావుర)
5. నిర్మల మాతకు గర్భమునొసగిన అద్భుత ఆత్మ దిగిరావా
(ఓ పావుర)
6. యోర్దాను నదిలో యేసయ్య తలపై దిగిన ఆత్మ దిగిరావా
(ఓ పావుర)
7. శిష్యులలో తేజము నింపిన సద్గుణ ఆత్మ దిగిరావా
(ఓ పావుర)