Sidilamai Potundi Song Lyrics | శిథిలమైపోతుంది Song Lyrics | Telugu Christian Songs Lyrics
శిథిలమైపోతుంది మానవదేహం
అది దేవుడు నిర్మించిన దేవాలయము "2"
కట్టడాలకున్న విలువ మనిషికున్నదా
పరలోకం వెళ్ళేది మనుషులే కదా
తిరిగి కట్టండి చితికిన బ్రతుకు
నిలబెట్టండి దేవుని కొరకు
మరుగున పడి పోతుంటే దేవుని నిజ మందిరం
మెరుగు దిద్దుకుంటుంది మానవుని కట్టడం "2"
గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్య
మనిషిని మించిన దేవాలయమేదయ్యా "2"
గేర సేనల దేశంలో ఒకడున్నాడు
బ్రతికి యుండగానేవాడు స్మశానం చేరాడు "2"
శిథిలమై పోయిన వాని బ్రతికును
పదిలముగా చేసి ఏసు నిలువబెట్టెను "2"
హస్త కృతలయములో దేవుడే ఉండడు
ఆ దేవుడు చెప్పిన నా ఈ మనుష్యుడు వినడు "2"
యేసు వచ్చేది కట్టడాలు చూచుటకా
చితికిపోయి కట్టబడిన బ్రతుకుల కొరకా "2"