Devuni Pilupu Song Lyrics | దేవునిపిలుపు Song Lyrics | Telugu Christian Songs Lyrics
దేవునిపిలుపు ఉందని నీవు మరువకు
ఆపిలుపు ఎపుడొస్తుందో నీవు ఎరుగవు ll2ll
ప్రతి ఒక్కరికి పంపుతాడు ఆహ్వానము
అందుకొనుటకు ఎదురుచూడాలి అందరము ll2ll
మరణమే ఆపిలుపనీ మరణమే ఆ ఆహ్వానమని ll2ll
IIదేవువిపిలుపుII
ఆత్మగా ఉన్న నీకు తల్లిగర్భములో ఆకారమిచ్చి
కొంతకాలము ఆయుష్షునిచ్చి పుడమిపై ఉంచెను నిన్ను దేవుడు ll2ll
భూమిపై ఉన్నంతకాలము ఆయనపనిలో నీవుండాలని
నీకియ్యబడిన పనిపూర్తయితే ఆయనతో ఉండుటకు వెళ్లిపోవాలని
పిలిచాడు దేవుడు నరులారా తిరిగిరండని తనయొద్దకు ll2ll
మరణమే ఆపిలుపనీ మరణమే ఆ ఆహ్వానమని ll2ll
IIదేవువిపిలుపుII
అప్పగించిన పనిని చేయుటకే నాడు వచ్చాడు క్రీస్తుయేసు
భూమిపై పనిని పూర్తి చేసి ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు ll2ll
దేహములో ఉన్నంతవరకు దేవుని పనిలో నీవుండాలని
నీదేహమును విడిచిపెడితే దేవునితో ఉండుటకు వెళ్లిపోవాలని
దేవునిపనిలో ఉన్నవారికి ఆయన పిలుపే ఒక వరం
లోకపనులలో మునిగిన వారికి ఆయన పిలుపే తీరని శోకము
మరణమే ఆపిలుపనీ మరణమే ఆ ఆహ్వానమని ll2ll
IIదేవువిపిలుపుII