Saranam O Yesudeva Song Lyrics | శరణం ఓ యేసుదేవ Song Lyrics | Telugu Christian Songs Lyrics

శరణం ఓ యేసుదేవ అద్వితీయ సత్యదేవ
అమరం నీ దివ్య ప్రేమ క్రీస్తు రాజా జీవ నాథా
ఈ ఘోర పాపికోసం చేసావ శిలువ యాగం
అర్పింతునయ్య నా చిన్ని హృదయం
1.నీ పాద సన్నిధి చేరానయ్యా
నా గుండె ఘోష వినుమో దేవా
ఒక్క మాటలో విన్నవింతును నా ప్రియ యేసయ్య
నా ప్రాణము నీవేనయ్యా
2.నిన్నుగా నేను చూడాలని
నేనుగా నిన్ను చేరానయ్యా
భాషలేని నా మూగ మనసుకు
స్పందన నీవేనయ్యా
నా ధ్యానము నీవేనయ్యా
3.మరణమే నన్ను వెంటాడినా
కష్టాల ఊబిలో కన్నుమూసినా
నీదు బిడ్డగా మహిమరూపినై
నిత్యం వుండాలని నే చేరాను నీ సన్నిధి