Nee Krupa Nee karuna Song Lyrics | నీ కృప నీ కరుణ Song Lyrics | Telugu Christian Songs Lyrics
నీ కృప నీ కరుణ చాలునయ్యా నా జీవితాన
ఇక దేనిని ఆశించను నే కోరను నా బ్రతుకున
చాలయ్యా చాలు నీ కృప చాలు
చాలయ్యా చాలు నీ కృప
మేలయ్యా యేసయ్య నీ సన్నిధి మేలయ్యా
1.ఏమంచి లేని నన్ను ప్రేమించినావే
కోట్లాది జనములలో
నను కోరుకున్నావే
ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నన్ను ఎక్కించిన యేసయ్య
విలువైన నీ పాత్రగా నను మలచిన నా యేసయ్య
2.మరణపు అంచుల నుండి నను మలపినావే
నరకపు పొలిమేరలో నను కనుగొన్నావే
కల్వరిలో నీ ప్రాణమిచ్చి
ననుకొన్న నా యేసయ్య
చెరగని నీ ప్రేమకు
సాక్షిగ మార్చిన యేసయ్య