Ninnu Stutinchalane Song Lyrics | నిన్ను స్తుతించాలనే Song Lyrics | Telugu Christian Songs Lyrics
నిన్ను స్తుతించాలనే తలంపు పుట్టగా
మారదా నా జీవితము స్తుతి పాత్రగా
నన్ను చేసిన విధము చూడగా
కలుగదా నాలో ఆశ్చర్యము "2"
స్తుతి నీకే యేసయ్యా
స్తోత్రము నీకే యేసయ్యా "3"
ఎవరికి పనికిరాని వాడనైతిని
ఎందరికో హేళనగా నే మారితిని
పనికొచ్చే పాత్రగా నను నీవు మలచితివి
హేళనైన నన్ను నీవు హెచ్చించావు
" నిన్ను స్తుతించాలనీ"
స్తుతి నీకే యేసయ్యా
స్తోత్రము నీకే యేసయ్యా "3"
నిను ఎరుగని వానిగా నే తిరిగితిని
పాప ఊభిలోనే పడిపోతిని
మరువని నీ ప్రేమ నను తాకేనే
నీ చేయి నాకు తోడై నన్ను లేపెనే
"నిన్ను స్తుతించాలనీ"
స్తుతి నీకే యేసయ్యా
స్తోత్రము నీకే యేసయ్యా "3"
నీకు సాక్షిగా నను నిలిపితివి
నీ పని కొరకై నన్ను ఏర్పరచితివి
అర్పణమయ్యే పాత్రగా నను నీవు చేసితివి
నీ సేవలో నన్ను నిలబెట్టితివి
స్తుతి నీకే యేసయ్యా
స్తోత్రము నీకే యేసయ్యా "3"
"నిన్ను స్తుతించాలనీ"