Nakunna Adharama Song Lyrics | నాకున్న ఆధారమా Song Lyrics | Telugu Christian Songs Lyrics
పల్లవి:
నాకున్న ఆధారమా - నా యేసయ్య
నా జీవనాధారము - నీవేనయ్యా
నా కొండా - నీవే నా కోట - నీవే నాకున్నా అవన్నీ - నీవే
యేసయ్యా యేసయ్యా - నా మంచి యేసయ్యా
యేసయ్యా యేసయ్యా - నా కన్న తండ్రి వయ్యా
1. నా సొంత జనులే - నన్ను వెలివేసిన
నా చుట్టూ నా హితులే - నన్ను గేలిచేసిన #2#
నా చెంత నిలిచావయ్యా - నా యేసయ్య #2#
నేనున్నా భయపడకంటూ ఆదరించినావయ #2#
2. ఆర్థిక అసమానతలే -నన్ను వెంటాడిన
అవమానం అనారోగ్యమే - నన్ను కృంగదీసిన #2#
నా చెంత నిలిచావయ్యా - నా యేసయ్య #2#
అద్భుతాలు ఎన్నో చేసి - ఆదరించినావయ్యా #2#