Anudinam Nee Prema Song Lyrics | అనుదినం నీ ప్రేమ Song Lyrics | Telugu Christian Songs Lyrics | Chrristian Song Lyrics in Telugu
అనుదినం నీ ప్రేమ... అనుక్షణం నీ దయ
నీ కృపాక్షేమమే...నా వెంట రాగా..
నా మంచి కాపరై నా ముందు నడువగా...
నాకున్న దేవుడై నాచేయి విడువక...
నా తండ్రివై నీవు నడిపించుచుండగా...
నీ ప్రేమలో నిలిచి నే పరవసింతును. ||అనుదినం||
నా దినములన్నియు..నీవశములేకదా....
నా అడుగులన్నియూ...నీవే స్థిరముచేయగా...
కోరుకొందును నిన్నే నా మొదటి ప్రేమగా...
సాగిపోదును నేను...నీ సాక్షినై ఇలలో...||అనుదినం||
నీ రాకకై నేనూ..వేచి యుందునూ ప్రభూ...
నీ పిలుపుకై నేనూ..ఎదురు చూతునూ..
గురి యొద్దకే నేనూ పరిగెత్తుచుందునూ..
నా ప్రభువు ముందుగా మోకరిల్లుక్షణముకై...
అనుదినం నీ ప్రేమ... అనుక్షణం నీ దయ...
నీ కృపాక్షేమమే...నా వెంట రాగా..||అనుదినం||