Gaganana Tharaka Song Lyrics | గగనాన తారక Song Lyrics | Telugu Christian Songs Lyrics
పల్లవి :
గగనాన తారక భువనాన వాలెగా వింతైన వార్త చెప్పగా
భయమేది లేదిక భారం తొలగిందిగా శ్రీ యేసు రాజుపుట్టగా
పరలోక తండ్రి ప్రేమగా తన వారసుణ్ణి పంపగా
భూలోక వాసులందరికి శుభవార్త పండుగా
కోరస్:
రారే జనాంగమా కనులారా చుద్దామా
సాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామా
పరలోక వాసుడు పరిశుద్ధ దేవుడు
తన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ.. ||గగనాన||
చరణం 01:
పరలోక పుత్రుడు...పరాక్రమశీలుడు
పశుశాలలో పసిబాలుడై నిశిరాత్రిలో శ్రీయేసుడు ..."2"
అన్ని నామాలకన్నా పైనున్నవాడు
తన రాజ్యస్థాపనకై సామాన్యుడైనాడూ....
కోరస్:
రారే జనాంగమా కనులారా చుద్దామా
సాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామా
పరలోక వాసుడు పరిశుద్ధ దేవుడు
తన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ.. ||గగనాన||
చరణం 02:
మనరక్షణార్ధమై...మనుజావతారుడై
మహిమోన్నత స్థలములు వీడి ఈ నేలపై వెలిసాడు.."2"
రాజాధిరాజు అతడు రాజసం వీడినాడు
మన హృదయ లోగిలిలో చోటుచాలన్నాడు.....
కోరస్:
రారే జనాంగమా కనులారా చుద్దామా
సాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామా
పరలోక వాసుడు పరిశుద్ధ దేవుడు
తన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ.. ||గగనాన||
Lyrics & Tune : Bapu Kondeti
Music Programming & Final Mix : Vicky M
Singer - Lillian Christopher