Adavi Chetla Naduma Song Lyrics | అడవి చెట్ల నడుమ Song Lyrics | Telugu Christian Songs Lyrics
అడవి చెట్ల నడుమ - ఒక జల్దరు వృక్షం వలె,
పరిశుద్ధుల సమాజములో - యేసు ప్రజ్వలించుచున్నాడు |2|
Bridge: కీర్తింతున్ నా ప్రభుని - జీవ కాలమెల్ల ప్రభు యేసుని,
(కృతజ్ఞతతో స్తుతించెదను) |2|
1. Stanza: షారోను రోజాయనే - లోయ పద్మమును ఆయనే,
అతిపరిశుద్ధుడు ఆయనే - పదివేలలో అతిశ్రేష్టుడు |2| ||కీర్తింతున్||
2. Stanza: ఘనమైన నా ప్రభువా - నీ రక్త ప్రభావమున,
నా హృదయము కడిగితివి - నీకే నా స్తుతి ఘనత |2| |
|కీర్తింతున్||
3. Stanza: మనోవేదన సహించలేక - సిలువ వైపు నే చూడగా,
లేవనెత్తి నన్నెత్తుకొని - భయపడకుమని అంటివి |2| ||కీర్తింతున్||
********************************************
Hebron Songs Lyrics
Songs of Zion