Bethlehemulo Raaraju Song Lyrics | బేత్లెహేములో రారాజు Song Lyrics | Telugu Christmas Songs Lyrics
పల్లవి:
బేత్లెహేములో రారాజు పుట్టెను
లోకమంతా సందడే ఆయెను (2)
ఊరు వాడా సంబరాలు చేసెను
పల్లె పల్లె కాంతులతో మెరిసెను (2)
వేడుక చేద్దాం - గంతులు వేద్దాం
పండగ చేద్దాం - ఇక సందడి చేద్దాం - రండి
1.
తూర్పున తార వెలిసెను నేడు
జ్ఞానులందరికి వార్త తెలిపెను చూడు (2)
నీతిమంతుడు అవతరించెనంటగా
పాప శాపమే అంతమాయెనంటగా (2)
వేడుక చేద్దాం - గంతులు వేద్దాం
పండగ చేద్దాం - ఇక సందడి చేద్దాం - రండి
2.
చీకటి తెరలు ఇక తొలగెను నేడు
లోకమంతటికి వెలుగు కలిగెను చూడు (2)
అంధకారమే తొలగిపోయెనంటగా
చీకు చింతలే తీరిపోయెనంటగా (2)
వేడుక చేద్దాం - గంతులు వేద్దాం
పండగ చేద్దాం - ఇక సందడి చేద్దాం - రండి
హ్యాపీ క్రిస్మస్ - మేరీ క్రిస్మస్
హ్యాపీ క్రిస్మస్ - మేరీ క్రిస్మస్
*******************************************
Vocals & Featuring Srinisha Jayaseelan
Written, Composed & Music by - Symonpeter Chevuri