Type Here to Get Search Results !

Unnavu Deva Song Lyrics | ఉన్నావు దేవా Song Lyrics | Telugu Christian Lyrics

Unnavu Deva Song Lyrics | ఉన్నావు దేవా Song Lyrics | Telugu Christian Lyrics

Unnavu Deva
ఉన్నావు దేవా యుగయుగములు - ఉన్నవాడ నీవే తరతరములు
ఉందునన్నావు సదాకాలము
యుగ సమ ఆప్తి వరకు - మాతోడై నీడై ||ఉన్నావు||

1.మోషేకు తోడై ఉన్నవాడనీవే
నీ జనుల నడిసంద్రాన నడిపించినావే (2)
అరణ్య యాత్రలో అద్భుతములు చేసితివే
ఆకాశమునుండి ఆహార మిచ్చితివే
బండ చీల్చి దాహము తీర్చిన అండవైన దేవుడ నీవే ||ఉన్నావు||

2.సింహాల బోనులో దానియేలుతో
ఆ అగ్నిగుండములో ఆబెద్నగోలతో (2)
ఐగుప్తునందున యేసేపుకు తోడై
ఆశీర్వదించి అధిపతిగ చేసితివే
శ్రమలలో నాతోడై వుందనన్నావే ||ఉన్నావు||

3.కన్నీటి లోయలో కష్టాల కడలిలో
అద్దరికి చేర్చి నన్నాదు కొందువే (2)
నా కన్న తండ్రి వలే కన్నీరు తుడిచితివే
నీ కంటి పాపలా కాపాడు దేవుడవే
ఇమ్మానుయేలువై నీవు నాకున్నావే ||ఉన్నావు||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area