Type Here to Get Search Results !

Dasama Bhagamu Lella Devunivi Song Lyrics | దశము భాగము లెల్ల Song Lyrics | Telugu Christian Lyrics

Dasama Bhagamu Lella Devunivi Song Lyrics | దశము భాగము లెల్ల Song Lyrics | Telugu Christian Lyrics

Dasama Bhagamu Lella Devunivi
దశము భాగము లెల్ల దేవునివి
ధారాళముగ నియ్య సమకూడుఁడి
పశువులు పైరులు దేవునివి
పసిఁడి లోహపుగనులు దేవునివి
భాగ్యభోగ్యము లెల్ల దేవునివి
భావించి కానుకలను నియ్యుఁడి ||దశమ||

దేవునివి దొంగలించెదరా
దేవదేవుని మోసపుచ్చెదరా
భావించి మది నెంచి భయము నెంచి
ప్రార్ధింపఁ దలవంచి ప్రభు భాగమున్
దేవాలయంబును పూర్ణంబుగా
దేదీప్యముగా నుండ సమకూర్చుఁడీ ||దశమ||

పరిశుద్ధ దేవుని మందిరముఁ
పరిపూర్ణముగాను యోచించుఁడీ
పరిశుద్ధ భాగము విడఁదీయుఁడీ
పాడిపంటలు నాస్తి దేవునిని
పదియవ భాగంబు దేవునివి
పరమాత్మ దీవెనలను బొందుఁడీ ||దశమ||

ప్రథమ ఫలంబులు దేవునివి
విదితంబుగా నీయ మది నెంచుఁడీ
సదమల హృదయములను బొందియుఁ
ప్రథమ భాగము నెల్ల విడఁదీసియు
ముదమున దేవునికర్పించుఁడీ
సదయు దీవెనలొంద సమకూర్చుఁడీ ||దశమ||

ఆకసపు వాకిండ్ల విప్పుదును
అధిక కృపలను గుమ్మరించుదును
మీ కష్టఫలములను దీవింతును
భీకర నాశంబుఁ దొలఁగింతును
మీ కానంద దేశ మిత్తు నని
శ్రీకరుం డెహోవా సెల విచ్చెను ||దశమ||

దినభోజనం బిచ్చు దేవునిని
ఘన సౌఖ్యముల నిచ్చు దేవునిని
వినయంబుతో మదిని ధ్యానించుచు
దినభోజనంబులను భాగించుచు
మానక దేవుని కర్పించు డీ
ఘనసేవ జయమొందు పని బూనడీ ||దశమ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area