Viluvainadhi Deva Nee Krupa Song Lyrics | విలువైనది దేవా నీ ప్రేమ Song Lyrics | Telugu Christian Lyrics
విలువైనది దేవా నీ ప్రేమ
క్షణమైనా నన్ను మరువనిది
నా ప్రతి అడుగును స్థిరపరిచి
తొట్రిల్లనీయక కాపాడినది
కృంగియున్న వేళలో ఆదరించిన కృప
జారియున్న స్థితిలో చేరదీసిన కృప
వెలకట్టలేనిది శ్రేష్ఠమైన నీ కృప
ఆరాధనా నా యేసుకే నా గానము నీ కోసమే
ఆరాధనా నా యేసుకే నా జీవితం నీ సేవకే
చరణం 1:
నీపై యున్న ప్రేమను వర్ణింప గోరగా
నాలో మార్పు తెచ్చిన సిలువ ప్రేమ కనబడెను
ఆ ప్రేమను మించిన ప్రేమ లేదు ఇలలోన
ఎలా బ్రతుకగలనయ్యా నీ తోడు లేకుండా ? ॥అ.ప॥
చరణం 2:
నీతో కలసి నేను పయనింప గోరగా
నా చేయి పట్టి నడిపించుచున్నావు
నీ జతే ఉండగా భయము లేదు ఇలలోన
ఎలా నిలువగలనయ్యా నీ తోడు లేకుండా? ॥అ.ప॥
చరణం 3:
నీతో కలిసి నేను నివసింప గోరగా
నాకై నీవు స్థలమును సిద్ధపరచుచున్నావు
నీ రాకకై నేను వేచియుంటి ఇలలోన
నిను చేరు వరకు నిరీక్షణతో వేచెదా... ॥అ.ప॥
క్షణమైనా నన్ను మరువనిది
నా ప్రతి అడుగును స్థిరపరిచి
తొట్రిల్లనీయక కాపాడినది
కృంగియున్న వేళలో ఆదరించిన కృప
జారియున్న స్థితిలో చేరదీసిన కృప
వెలకట్టలేనిది శ్రేష్ఠమైన నీ కృప
ఆరాధనా నా యేసుకే నా గానము నీ కోసమే
ఆరాధనా నా యేసుకే నా జీవితం నీ సేవకే
చరణం 1:
నీపై యున్న ప్రేమను వర్ణింప గోరగా
నాలో మార్పు తెచ్చిన సిలువ ప్రేమ కనబడెను
ఆ ప్రేమను మించిన ప్రేమ లేదు ఇలలోన
ఎలా బ్రతుకగలనయ్యా నీ తోడు లేకుండా ? ॥అ.ప॥
చరణం 2:
నీతో కలసి నేను పయనింప గోరగా
నా చేయి పట్టి నడిపించుచున్నావు
నీ జతే ఉండగా భయము లేదు ఇలలోన
ఎలా నిలువగలనయ్యా నీ తోడు లేకుండా? ॥అ.ప॥
చరణం 3:
నీతో కలిసి నేను నివసింప గోరగా
నాకై నీవు స్థలమును సిద్ధపరచుచున్నావు
నీ రాకకై నేను వేచియుంటి ఇలలోన
నిను చేరు వరకు నిరీక్షణతో వేచెదా... ॥అ.ప॥