Athisrestuda Na Yesayya Song Lyrics | అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా పాట మాటలు
Genre: Telugu Christian Worship
Language: Telugu
Theme: Praise and Worship
Popular Versions: Various Telugu Christian choirs
పూర్తి పాట మాటలు
అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా
మహాఘనుడా మహోన్నతుడా
నీ కార్యములు గంభీరముల్ -2
గళమెత్తి స్వరమెత్తి నే పాడెదన్ -2
Verse 1
స్తుతులు చెల్లించగానే యెరికో గోడలు కూలెనే
కీర్తనలు పాడగానే చెరసాల బ్రద్దలాయే -2
నీ జనుల ముందు శత్రువులే నిలుచునా
నీ బలము ముందు బందకాలుండునా -2
బందకాలుండునా
గళమెత్తి స్వరమెత్తి నే పాడెదన్ -2
Verse 2
నీ ముందు నిలిపిన దాగోను ముక్కలాయెనుగా
నిన్ను చూసిన సేనా దెయ్యాలు వణికి పోయెనుగా -2
నీ శక్తి ముందు ఏదైనా నిలుచునా
నీ అగ్ని అన్నిటిని దహించి వేయునుగా -2
దహించి వేయునుగా
గళమెత్తి స్వరమెత్తి నే పాడెదన్ -2
Verse 3
సియోనులోనుండి మమ్ము ఆశీర్వదించితివి
శిథిలమైన బ్రతుకులను శిఖరముపై నిలిపితివి -2
నీ మహిమముందు శాపమే నిలుచునా
కృపవెంబడి కృపతో నడుపుచున్నావయ్యా -2
నడుపుచున్నావయ్యా
గళమెత్తి స్వరమెత్తి నే పాడెదన్ -2
పాట యొక్క అర్థం
ఈ పాట యేసుక్రీస్తు యొక్క ఘనత, శక్తి మరియు రక్షణ గురించి వివరిస్తుంది. పాటలో భక్తుడు యేసును "అతి శ్రేష్ఠుడు", "మహాఘనుడు" అని స్తుతిస్తూ, ఆయన శక్తి ముందు శత్రువులు నిలవలేరని, ఆయన కీర్తనలు గోడలను కూల్చివేస్తాయని విశ్వాసంతో పాడుతున్నాడు.
Note: These lyrics are provided for educational and devotional purposes only. All copyrights belong to their respective owners. If you are the copyright holder and wish to have this removed, please contact us.