Type Here to Get Search Results !

Siluvalo Tholagenu Song Lyrics | సిలువలో తొలగెను Song Lyrics | Vijay Prasad Reddy New Song Lyrics

Siluvalo Tholagenu Song Lyrics | సిలువలో తొలగెను Song Lyrics | Vijay Prasad Reddy New Song Lyrics

Siluvalo Tholagenu Song Lyrics
సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం
విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం ''2''

పరిశుద్ధత అను ఐశ్వరం
కృప ద్వారా ఇక నా సొంతం
పాపాత్ముడు అను దారిద్ర్యం
తొలగించినది ప్రభురక్తం

నేను ధనవంతుడను క్రీస్తునందుకడుగబడ్డాను
ఇకపై పాపిని కాను కృప ద్వారా రక్షణ పొందాను''2''

సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం
విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం

1.ధర్మశాస్త్రమను చెరలోన పాపపు బందీలు ఎవరైనా
క్రీస్తునందే విమోచన అది దేవుని సముచిత దీవెన
అది దేవుని సముచిత దీవెన

కాలగతులు తన వశమైనా మారుమనసు పొందిన
మదిన నిరంతర క్షమాపణ అది దేవుని నిత్యనిబంధన
అది దేవుని నిత్య నిబంధన "2"

నేను పరిశుద్ధుడను క్రొత్తగా జన్మించాను
క్రీస్తునందు స్వాస్థ్యమయ్యాను
శాశ్వతమగు జీవము పొందాను"2"

సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం
విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం

2.పాపమైన అపరాధమైన చచ్చిపడిన ఆ స్థితిలోన
నా శాపమునే పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ
నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ

పాడుబడిన నా దేహమున
దైవమందిరమునే నిలిపిన పరిశుద్దునికి
నివేదన ఇది పరిశుద్దాత్ముని సూచన
ఇది పరిశుద్దాత్ముని సూచన "2"

నేను పిలువబడ్డాను సంఘములో చేర్చబడ్డాను
వాగ్దానము పొందియున్నాను పరలోకపు పౌరుడనయ్యాను "2"

"సిలువలో"

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area