Manche leni naa paina lyrics | మంచే లేని నాపైన Song Lyrics | Songs telugu jesus

మంచేలేని నాపైన ఎంతోప్రేమచూపావు
ఆదియంతమైనవాడవు మానవుని రూపమెత్తావు
పరలోకమును విడిచి దిగివచ్చినావు భువికి
అ.ప. : ఎంతగా స్తుతులు పాడినా
యేసూ నీ ఋణము తీరునా
1. లోకాలన్నీ ఏలే రారాజువైన నీవు
సామాన్యుల ఇంట నీ కాలుపెట్టినావు
నీదెంత దీనమనసు నాకెంత ఘనత యేసూ
2. నాశనమైన నన్ను రక్షించగోరి నీవు
వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు
నీలోన జాలి పొంగె నాలోన శాంతి నిండె
3. చీకటిలో కూర్చున్న నా స్థితినిచూచి నీవు
వేకువ వెలుగువంటి దర్శనమునిచ్చినావు
నీ సాటిలేనిత్యాగం - నాపాలి గొప్పభాగ్యం
ఆదియంతమైనవాడవు మానవుని రూపమెత్తావు
పరలోకమును విడిచి దిగివచ్చినావు భువికి
అ.ప. : ఎంతగా స్తుతులు పాడినా
యేసూ నీ ఋణము తీరునా
1. లోకాలన్నీ ఏలే రారాజువైన నీవు
సామాన్యుల ఇంట నీ కాలుపెట్టినావు
నీదెంత దీనమనసు నాకెంత ఘనత యేసూ
2. నాశనమైన నన్ను రక్షించగోరి నీవు
వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు
నీలోన జాలి పొంగె నాలోన శాంతి నిండె
3. చీకటిలో కూర్చున్న నా స్థితినిచూచి నీవు
వేకువ వెలుగువంటి దర్శనమునిచ్చినావు
నీ సాటిలేనిత్యాగం - నాపాలి గొప్పభాగ్యం