Type Here to Get Search Results !

Veligindhi Oka Thara Ningilo Song Lyrics | వెలిగింది ఒక తార నింగిలో Song Lyrics

Veligindhi Oka Thara Ningilo Song Lyrics | వెలిగింది ఒక తార నింగిలో Song Lyrics

Veligindhi Oka Thara Ningilo Song Lyrics
వెలిగింది ఒక తార నింగిలో
క్రీస్తుయేసు జనన వార్త తెలుపను
వెలగాలి నీవు ఈ లోకంలో
క్రీస్తు ప్రేమను రుచిచూపేలా
యేసే రక్షకుడని క్రీస్తే అబిషక్తుడని
తోడైయుండే దేవుడని ప్రకటించాలి
ఆశ్చర్యకరుడని బలమైనదేవుడని
ఆలోచన కర్తని ఆరాధించాలి

అ॥ప॥
సర్వోన్నతమైన స్థలములలోనా
దేవునికే మహిమ కలుగునుగాక .

1. నసించుచున్న దానిని రక్షించుటకు
దేవుడే దిగొచ్చినాడుగా
అంధకారమందు వెలుగునింపుటకొరకు
నీతిసూర్యుడు ఉదయించెనుగా
క్రీస్తును దరియించినా వారందరు
ధరణిలో వెలగాలిగా
నీతిమార్గమందు అనేకులనుచేర్చగా
తారవలె వెలగాలిగా
యేసే దేవుడని ఆయనే సజీవుడని
పాపవిమోచకుడని ప్రకటించాలి
అన్ని నామములకన్న పైనామమేసని
ప్రభువైన క్రీస్తును ఆరాధించాలి
॥సర్వోన్నతమైన॥

2. పరలోకమేలుచున్న మహరాజైనను
రిక్తునిగా అరుదెంచెనుగా
సర్వమానవాళిని రక్షించుటకు
తనప్రాణమర్పించెనుగా
క్రీస్తును నమ్మి వెంబడించువారు
సత్ క్రియలతో వెలగాలిగా
నరకాగ్నినుండి అనేకులను రక్షింప
సువార్తను ప్రకటించాలిగా
యేసే సత్యము యేసే జీవము
పరలోక మార్గమని ప్రకటించాలి
పరిపూర్ణుడేసని పరిశుద్దదేవుడని
నీతిసూర్యుడేసని ఆరాధించాలి
॥సర్వోన్నతమైన॥

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area