Type Here to Get Search Results !

Uppongene Hrudayam Song Lyrics | ఉప్పొంగేనే హృదయం Song Lyrics | New Telugu Christmas Song Lyrics

Uppongene Hrudayam Song Lyrics | ఉప్పొంగేనే హృదయం Song Lyrics | New Telugu Christmas Song Lyrics

Uppongene Hrudayam Song Lyrics
ఉప్పొంగేనే హృదయం ఆనందంతో
పులకించేనే పుడమి సంతోషంతో
రాజాదిరాజు జన్మించేఇలలో
లోక పాపాన్ని తొలగించుటకు ||2||
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
సమాధాన అధిపతి మన యేసయ్యా
శరీరధారియై ఈ భువిలో జన్మించే
ఆహా ఆశ్చర్యం అద్భుతం రక్షకుని జననం
||ఉప్పొంగేనే||

1. చీకటిని తొలగించి మన బ్రతుకులో
వెలుగును నింపే నీతి సూర్యుడై ఉదయించెను
బంధకములలోనుండి మనలను
విడిపించుటకు దేవుడే దీనుడై పుట్టెను ||2||
సర్వలోకానికే సమాధానమే
ధన్యమైన ఈ భువికెంతో పరవశమే
మహదానందమే ఇక సంతోషమే
లోకరక్షకుడు మనకై జన్మించెను
|| ఆశ్చర్య||

2. పరలోకసైన్యమే దూతలతో దిగివచ్చి
సర్వోన్నత దేవుని ఆరాధించగా
తార దారిచూపగ గొల్లలు జ్ఞానులు
యేసుని చేరి పూజించగా ||2||
సర్వలోకానికే ఈ శుభవార్తను
మనమంతా కలిసి ఇల ప్రకటింపగా
రక్షణానందమే ఇక సంబరమే
మన హృదయాలలో క్రీస్తు జన్మించగా
|| ఆశ్చర్య||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area