Type Here to Get Search Results !

Chandamama Chandamama Song Lyrics | చందమామ చందమామ Song Lyrics | Christmas Songs Lyrics

Chandamama Chandamama Song Lyrics | చందమామ చందమామ Song Lyrics | Christmas Songs Lyrics

Chandamama Chandamama Song Lyrics
చందమామ చందమామ
రాజు పుట్టాడంట ఓయమ్మా
వెన్నెలమ్మిది నిజమా
అతన్నికన్నా సుందరుడంటమ్మా "2"
నవ్వుల పసిబాలూడోయమ్మ
అధ్వితీయుడే అరుదించడమ్మా
నశియించే మనకోసం ప్రేమించి ఇలా వచ్చాడమ్మా
రండయ్యో రండమ్మా స్వాగతీద్దాం
మన హృదయంలోనే వేదికేద్దాం
సంతోష సంబరాలు చేసేద్దాం
మనమంతా కలిసి పండుగ చేద్దాం "2"

1.యూదయ దేశమున బేత్లేహేము గ్రామమున
ఓ గొప్ప వెలుగు ప్రకాశించే
ఏమిటని సూడబోతే ఓ దూత ఎదురుపడి
మెస్సయా పుట్టాడని వార్త చెప్పే
పరుగున పరుగున సూడ వెళ్ళామే
రారాజునే దర్శించామే
ఆ సుందరుని హృదిలో మేము నిండామే
ఎంత భాగ్యమిదని గొల్లలు పాడారే

2.ఓరోరి సిన్నవాడా సూడరా గొప్ప తార
మనరాజు పుట్టే సూచనరా
ఆరా తెదామురా పండుగ చేదమురా
విలువైనవన్నీ అర్పిదామురా
అంటూ జ్ఞానులే చూడ వెళ్లారే
ఆ గొప్ప రాజుని పూజించారే
దేవధూతలే మహిమతో నిండారె
ఎంత అద్భుతమిదని పరవశించారే
"చందమామ చందమామ "

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area