Type Here to Get Search Results !

Yugalalo Taralalo Song Lyrics | యుగాలలో తరాలలో Song Lyrics | New Telugu Worship Song Lyrics

Yugalalo Taralalo Song Lyrics | యుగాలలో తరాలలో Song Lyrics | New Telugu Worship Song Lyrics

Yugalalo Taralalo Song Lyrics
యుగాలలో తరాలలో సజీవుడైన దేవుడవు నీవే యేసయ్యా
నిత్యము ఉండేది ఈ లోకములో లేదు
శాశ్వతముండేది నీ రాజ్యము యేసయ్యా
నన్ను చేర్చుటకు నీ మార్గము చూపావు
అర్హత పొందుటకు నీ రక్తము కార్చావు

చరణం:
( 1 ) లోకములో ఏ శ్రమలైనా నీవుంటే పోయెనుగా
బాధలో నేనున్నా నీ వైపే చూస్తే తీరునుగా
నీవే లేకుంటే నేనేమైపోతానో
నీవే రాకుంటే నేనేమై ఉంటానో
నీవే తోడుంటే అదియే చాలయ్యా
నీవే నాకుంటే ఇంకెంతో మేలయ్యా

( 2 ) పాపములో చెడివున్న పరిశుద్ధుడవై నన్ను తాకావు
నీ రక్తముతో నా దోషములు తొలగించి ఆత్మతో
నింపావు
నీ ప్రాణము పోకుంటే నా జీవము ఏమౌనో
నీ త్యాగము లేకుంటే ఈ రక్షణ ఏమౌనో
నీ కృపయే లేకుంటే ఈ బ్రతుకే లేదయ్యా
నీజాలే లేకుంటే ఇక నేనే లేనయ్యా

( 3 ) ఒక మానవుడై భువిపై జీవించి ప్రతి శోధనలో జయమును పొందావు
ప్రతి శత్రువుపై ప్రేమను చూపించి నిజ ప్రేమికుడై
ఇలలో నిలిచావు
నీ జయమే లేకుంటే నా విజయం ఏమౌనో
నీ ప్రేమే లేకుంటే ఈ ప్రాయం ఏమౌనో
నీ కరుణే లేకుంటే ఈ కాలం లేదయ్యా
నీ దయనే లేకుంటే ఈ ధన్యత రాదయ్యా

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area