Yepaati Vaaram Song Lyrics | ఏపాటి వారము Song Lyrics
పల్లవి :
ఏపాటి వారము మేమెంతటి వారము
ఈ లోక రీతిన మేము గనులైన వారము కాము
మము పిలిచినీ దరిచేర్చినావు.. నీ రాజ్యములో మాకు చోటిచ్చినావు
ఏమిచ్చి నీ రుణము తీర్చుకుందుము
ఏ విధంగా నీకై వాడబడుదుము నేర్పవా...
చరణం 1:
దీనుడైన నాపై జాలి చూపి
నీ మాటలు పలుకుటకు నన్ను నిలిపావు
బలహీనులమైన మము బలపరచి
నీ పాటలు పాడుటకు కృప చూపావు
నీ కార్యములను నే చేయుటకు నన్ను ఎంచుకున్నావు నీవు
నీ క్రియలను నేను ఘనపరచుటకు నన్ను దీవించావు
నీవు నీకై నేను జీవించి నీ చెంతకే మే చేరేదము... || ఏపాటి వారము ||
చరణం 2 :
వెర్రి వారమైన మాపై ప్రేమ చూపి
జ్ఞానులకే నీ మాటలు వినిపించావు
ఎన్నిక లేని మాపై కరుణా చూపి
క్రీస్తు ద్వారా మాకు రక్షణ ఇచ్చావు
ఘనహీనులమైన తృణీకరింపక నీతికి వారసుల చేసినావు
సర్వలోకమునకు సత్యము ప్రకటించ అధికారమిచ్చావు నీవు
జీవించి మేము నీ కై మరణించి
మరణించిన గాని తిరిగి లేవగలము... || ఏపాటి వారము ||